ఎముకలు దృఢంగా ఉండాలా..? అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే.. లేదా కష్టమే

ఎముకలు దృఢంగా ఉండాలా..? అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే.. లేదా కష్టమే

మానవ శరీరంలో ఎముకలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వీటి పటిష్టత వయసుకు తగ్గట్లు మారుతుంటుంది. బాల్యంలో సున్నితంగా, యవ్వనంలో దృఢంగా, వృద్ధాప్యంలో మరింత సున్నితంగా మారే ఎముకలపై జీవన శైలి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలు తీసుకోవడంతో యువత, చిన్నపిల్లల్లో ఎముకల వ్యాధులు వస్తున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన వీటిని రక్షించుకోవాంటే ఇవి ఫాలో కావాలి.

1. ఉప్పు మితంగా తీసుకోవడం

మనం ఎంత ఎక్కువ ఉప్పు తింటే శరీరంలో అంత ఎక్కువగా కాల్షియం తగ్గిపోతుంది. సాధారణంగా మానవ శరీరంలో కాల్షియంపాళ్లు బ్యాలెన్స్​గా ఉండాలి. స్ర్టీట్​ఫుడ్స్ లో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. ఇవి మరింత హానీ చేస్తాయి. అందుకే ఉప్పు మితంగా తీసుకోవాలి.

2. ప్రొటీన్​ మితంగా తీసుకోవడం

ఏంటి ప్రొటీన్​ ఎక్కువ తీసుకోవడంతో ఎముకలు ఆరోగ్యాన్ని కోల్పోతాయా..  ? మీరు విన్నది నిజమే.. ప్రొటీన్​ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అందరూ అనుకుంటారు.  పరిమితికి మించి తీసుకుంటే ఎముకలు బలాన్ని కోల్పోయి, ఒళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రొటీన్లను మరీ ఎక్కువ కాకుండా తీసుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. 

3. పొగతాగటం..  

పొగతాగడం ఆరోగ్యంపైనే కాదు.. ఎముకలపైనా ప్రభావం చూపుతుంది. ఇవి ఎముకలకు పగుళ్లు ఏర్పడేలా చేస్తాయి. అందుకే పొగకు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు. 

4. బరువు తక్కువగా ఉండటం..

బరువు ఎక్కువుగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తక్కువగా ఉంటే ఎముకలకు మంచిది కాదని అంటున్నారు వైద్యులు. తక్కువ బరువున్న వారికి ఆస్టియోపొరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది బోన్​ లాస్​కి, బోన్​ వ్యాధులకు కారణం కావచ్చు. కాబట్టి బరువును తటస్థంగా ఉంచుకోవాలి.

5. శారీరక శ్రమ ఎక్కువగా చేయడం

ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారా.. అయితే మీ ఎముకలు జాగ్రత్త. శారీరక శ్రమ లేకుంటే ఎముకల సంగతి అంతే. నిర్దిష్టంగా టైం సెట్​ చేసుకుని నిత్యం వాకింగ్​, రన్నింగ్​ లాంటివి చేస్తూ ఉండండి. అవి ఎముకలను దృఢంగా చేస్తాయి. 

వీటికి తోడు ఎముకలను పటిష్టపరిచే పాలు, బోన్​ సూప్​ తదితర ఆహార పదార్థాలను డైట్​లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి.