Valentine Day Special : రిలేషన్ షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి

Valentine Day Special : రిలేషన్ షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి

ఒక రిలేషన్ షిప్ ఎన్నాళ్లు కంటిన్యూ అవుతుందనేది వాళ్ల మధ్య ఉన్న అనుబంధం, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ రిలేషన్షిప్లోనైనా. ఛాలెంజెస్ తప్పవు . ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఇద్దరినీ ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. నీది... నాది.... అని కాకుండా మనది అనే ఫీలింగ్ లేకపోవడం కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిని నేర్పుగా ఎదుర్కొంటూ ఒకటిగా నడవడం చాలా ముఖ్యం అంటోంది.

* రిలేషన్షిప్ సంతోషంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ కంపల్సరీ. అంతేకాదు చిన్నచిన్న గొడవలు జరిగినా కూడా వెంటనే కలిసిపోవాలి. అవతలివాళ్లే ముందుగా చొరవ తీసుకోవాలని అనుకోవద్దు. “సారీ”
అనేది చిన్నమాటే. కానీ, ఆ మాట చెప్తే మనస్ఫర్థలు దూరమైతాయి. 
• కమ్యూనికేషన్ బంధ బాగున్నట్టు అవతలివాళ్లు నచ్చని పని చేసినా, కొత్తగా ప్రవర్తించినా వెంటనే 'ఫలానా విషయాలు నాకు నచ్చవు' అని చెప్పేయాలి. అలాచేస్తే, ఏ విషయమైనా పెద్దది కాదు. అలాకాకుండా ప్రతీది మనసులో దాచుకుంటే ఇద్దరి మధ్య దూరం పెరిగి, రిలేషన్ షిప్ దెబ్బతింటుంది.
* ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అంతేకాదు అవతలివాళ్లు చెప్పేది విని, వాళ్ల సమస్యల్ని అర్థం చేసుకోవాలి. అంతేతప్ప వాళ్లు చెప్పేది వినకుండానే వాళ్లని జడ్జ్ చేయొద్దు. 
* అప్పుడప్పుడు టూర్స్ కి వెళ్లాలి. కొత్త ప్లేస్లకి వెళ్తే మరింత హుషారుగా ఉంటారు. అంతేకాదు రెగ్యులర్గా సర్ ప్రైజింగ్ గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవాలి. ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఒక్కటిగా నడవాలనే కోరిక
ఎప్పటికీ అలాగే ఉంటుంది.