ఇంటర్నెట్ స్పీడ్ ఇలా

ఇంటర్నెట్ స్పీడ్ ఇలా

ఈరోజుల్లో ఆఫీస్​లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఇంటర్నెట్ తప్పనిసరి. అందుకే చాలామంది వర్క్​ ఫ్రమ్​ హోమ్ టైమ్​లో ఇంట్లో వైఫై పెట్టించుకున్నారు. మంచి కంపెనీ వైఫై కనెక్షన్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఇంటర్నెట్ సరిగా రాదు. చాలాసేపు బఫరింగ్ అవుతుంటుంది. దాంతో, వర్క్​ ఆగిపోతుంది. 
ఇంటర్నెట్ స్పీడ్​గా రావడానికి ఏం చేయాలంటే..

 వైఫై ఛానెల్ ఛేంజ్​ 
ఇంటర్నెట్ సరిగా రానప్పుడు వైఫై ఛానెల్​ను అడ్జస్ట్​ చేయాలి. అపార్ట్​మెంట్​ లేదా ఇంటి పక్కనవాళ్లు ఒకటే వైఫై కనెక్షన్ ఉపయోగించడం వల్ల వైఫై స్పీడ్​ తగ్గుతుంది. అందుకని వైఫై మీ  ఫోన్​, కంప్యూటర్​కి కాకుండా వేరే వాళ్ల ఫోన్​కు కనెక్ట్ అయిందేమో చెక్​ చేయాలి. ఒకవేళ అలా కనెక్ట్ అయితే కనుక వెంటనే  వైఫై పాస్​వర్డ్ మార్చాలి. 

ఫ్రీక్వెన్సీ సెట్టింగ్
బఫరింగ్ కాకుండా ఇంటర్నెట్ రావాలంటే బెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. మామూలుగా వైఫైలో రెండు రకాల ఫ్రీక్వెన్సీ లేదా బ్యాండ్​విడ్త్​ ఉంటుంది. 2.4గిగాహెడ్జ్​ లేదా 5 గిగాహెడ్జ్.. ఈ రెండింటిలో 2.4గిగాహెడ్జ్ స్లోగా ఉన్నప్పటికీ సిగ్నల్​ బాగా వస్తుంది. దూరం నుంచి కూడా ఈ రౌటర్​కి కనెక్ట్ చేసుకోవచ్చు. 5గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ  స్ట్రాంగ్ కాదు. కానీ, ఇంటర్నెట్ స్పీడ్​గా వస్తుంది. 

వైర్ కనెక్షన్ బెటర్
ఇంటర్నెట్ స్పీడ్​గా రావాలంటే వైర్ కనెక్షన్ తీసుకోవాలి. వైఫై రౌటర్​కి దగ్గర్లో కంప్యూటర్, ఫోన్ వాడేటప్పుడు వైర్​తో కనెక్ట్ చేసుకుంటే బెటర్. అలాకాకుండా రౌటర్ దూరంగా ఉంటే  కేబుల్ సాయంతో సిస్టమ్​కు కనెక్ట్ చేయొచ్చు. 

రౌటర్ ప్లేస్ ముఖ్యమే
రౌటర్​ని సిగ్నల్ వచ్చే ప్లేస్​లో పెట్టాలి. అంతేకాదు రౌటర్​ని ఎలక్ట్రిక్ కనెక్షన్​ ఉండే టీవీ, బ్లూటూత్ స్పీకర్, బేబీ మానిటర్, గేమింగ్ గాడ్జెట్స్​కు దగ్గర పెట్టొద్దు. రౌటర్​ని హాల్లో ఐదు అడుగుల ఎత్తులో పెట్టుకుంటే, ఇంట్లో ఎక్కడ కూర్చొన్నా వైఫై వస్తుంది. 

సర్వీస్ ప్రొవైడర్స్​కి చెప్పాలి
వైఫై సిగ్నల్ రాకున్నా, ఇంటర్నెట్ బఫరింగ్ అవుతున్నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్​కు కంప్లైంట్ చేయాలి. వైఫై కనెక్షన్​ తీసుకునేటప్పుడే క్వాలిటీ వైఫై రౌటర్, కేబుల్​​ ఇవ్వమనాలి. ఇంటర్నెట్ స్పీడ్ అప్​గ్రేడ్ గురించి కూడా చెప్పాలి.