ఫుడ్ డెలీవరీలు తగ్గినయ్.. పార్సిల్స్ పెరిగినయ్

ఫుడ్ డెలీవరీలు తగ్గినయ్.. పార్సిల్స్ పెరిగినయ్
  • కరోనాతో తగ్గిన బుకింగ్‌‌లు
  • హోటల్‌‌ కెళ్లి తెచ్చుకుంటున్న జనం
  • పార్శిల్‌‌ అమ్మకాల్లో 35% వృద్ధి
  • గుడ్డు తినుడు పెంచిన ప్రజలు
  • సిటీలో రోజూ 15 లక్షల అమ్మకం
  • రాష్ట్రవ్యాప్తంగా 10% పెరిగిన సేల్స్

 

కరోనా భయంతో హైదరాబాద్, వెలుగు: హోటళ్ళకు  పోయి తినుడు, ఫుడ్‌ బుక్‌ చేసుకునుడు తగ్గించిన జనాలు.. టేక్‌ అవేలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డెలివరీ తీసుకోవడా నికి బదులు సొంతంగా హోటల్‌‌ కెళ్లి ఫుడ్‌‌ను ఇంటికి తెచ్చుకుంటున్నరు. వైరస్‌‌ను ఎదుర్కోవడానికి ప్రోటీన్‌‌ ఫుడ్‌‌తీసుకునుడు కూడా జనం పెంచారు. తక్కువ రేటుకు దొరికే ప్రోటీన్‌‌ ఫుడ్‌ ‌గుడ్డును బాగా తింటున్నారు.దీంతో ఇటు హోటళ్ల పార్సిల్‌ ‌సేల్స్‌ ‌35 శాతం పెరగ్గాఅటు రాష్ట్రవ్యాప్తంగా గుడ్లఅమ్మకాలు 10 శాతం పెరిగాయి.

టేక్‌ అవేలతో ఊరట

సిటీలో 10 వేల హోటల్స్ ఉండగా కరోనాతో లేబర్ తగ్గి, నిర్వహణ భారం పెరిగి 60 శాతానికి పైగా మూతపడ్డాయి. తెరిచిన ఆ కొన్ని హోటళ్లు కొవిడ్ రూల్స్‌‌పాటిస్తూ ఫుడ్ డెలివరీ చేస్తున్నా ఆన్‌‌లైన్ డెలి వరీల సంఖ్య బాగా పడిపోయింది. ఒకప్పుడు నచ్చిన ఫుడ్‌‌ను కూర్చున్న చోటికే తెప్పించుకున్న వాళ్లంతా డెలివరీ బుకింగ్‌‌లు తగ్గించారు. టేక్ అవేలకు ప్రియార్టీ ఇస్తున్నారు. నచ్చిన ఫుడ్‌‌ను నేరుగా హోటళ్ల కెళ్లి తీసుకొచ్చుకుంటున్నారు. దీంతో రెండు నెలలుగా టేక్ అవే బిజినెస్ పుంజుకుంటోంది. కరోనా రోజుల్లో ఒక్కో హోటల్‌‌లో రోజువారీ టేక్ అవేల సంఖ్య 80 వరకు ఉంటే ఇప్పుడు 120 నుంచి 150 మధ్య ఉంటోందని నారాయణగూడలోని ఓ హోటల్ నిర్వ హకుడు చెప్పారు. లాక్‌డౌన్ వల్లనష్టపోయిన తమకు టేక్ అవేలు కాస్త ఊరటనిస్తున్నాయన్నారు. ఫుడ్ ప్రి పరేషన్‌‌లో జాగ్రత్తలు, కొవిడ్ రూల్స్‌‌పాటిస్తూ ఫుడ్ ప్యాకింగ్ చేస్తుండటంతో రిపీటెడ్‌ ‌గిరాకీ పెరిగిందని చెబుతున్నారు.

గుడ్డు మస్ట్

తినే ఆహారంలో పోషకాలు బాగుంటే కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధకత పెరుగుతుందని.. ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్‌‌తో పాటు కోడి గుడ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో జనాలు గుడ్లు తినేందుకు ఇంట్రెస్ట్‌‌ చూపిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, చికెన్, మటన్‌‌తో పోల్చితే గుడ్లధర తక్కువ కావడంతో రోజూ తినే ఆహారంలో గుడ్లను చేర్చు కుంటున్నారు. ఒకప్పుడు వారానికోసారి తినే వాళ్లు కూడా రోజూ ఉడకబెట్టిన గుడ్లను తింటున్నా రు. కరోనా బాధితుల ఫుడ్ మెనూలోనూ గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌‌ ఇస్తుండటంతో వ్యాధి తగ్గినాగ్గి గుడ్లను వాళ్లుకంటిన్యూ చేస్తున్నారు.

 ‘డెలివరీ’ భయం

కరోనా వల్లడెలివరీ బాయ్స్ తీసుకొచ్చే ఫుడ్ పార్శిళ్ల పై భయాందోళనలు పెరిగాయి. దీంతో ఫుడ్‌‌ ఆన్‌‌లైన్ బుక్ తగ్గినట్గ్గి లుతెలుస్తోంది. గత 4 నెల్లోపార్శిల్ చేసే డెలివరీ బాయ్స్ సంఖ్య భారీగా పడిపోయిందని ఆర్టీసీ క్రాస్ రోడ్డు కేంద్రంగా పని చేసే డెలివరీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుం ఈ రీజియ న్‌‌లో పని చేసే డెలివరీ బాయ్స్ 100 లోపే ఉన్నారని, మామూలు రోజుల్లో 300కు పైగా ఉండేవారని చెప్పారు. ఒక్కో బాయ్ కనీసం 10 నుంచి 15 ఆర్డర్లను కస్టమర్లకు అందించే వారని మేనేజర్ విజయ్ వివరించారు.

పెరిగిన సేల్స్ పోషకాహారం గురించి ఎక్కువగా ప్రచారం కావడంతో కోడిగుడ్లు తినడం పెరిగిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రోజూ 3 కోట్లగుడ్లు ఉత్పత్తి అవుతుండగా 1.5 కోట్లు ఇక్కడే సేల్‌ అయ్యేవి. తాజాగా ఈ సంఖ్య 1.65 కోట్లకు పెరిగింది. సిటీలో రోజుకు 15 లక్షలకు పైగా గుడ్లు తింటున్నా రు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ గుడ్లఅమ్మకాలు 10% పెరిగాయని డిస్ట్రి బ్యూటర్లు అంటున్నారు.