
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్తో పాటు మేకర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్గా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ టాక్ బయటకొచ్చింది.
SSMB29 మూవీ పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్-థియేట్రికల్ డీల్స్‌లో ఒకటని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అనేక నేషనల్ మీడియాల్లో నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఖచ్చితమైన మొత్తం ఎంతనేది ఇంకా వెల్లడి కాలేదు.
రాజమౌళి లాస్ట్ మూవీ RRRను జీ5 మరియు నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకోవడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, లోనూ ఘన విజయం సాధించింది. ఇపుడీ SSMB29 భారీ OTT ఒప్పందం వెనుక RRRవిజయం ఒక కారణం కావచ్చని సినీ వర్గాల టాక్.
"RRR" OTT హక్కులు అన్ని భాషలకు కలిపి రూ.325 నుంచి రూ.350 కోట్ల మధ్య డీల్ జరిగింది. ఈ డీల్ భారతీయ సినిమాకు సంబంధించిన అతిపెద్ద డీల్‌లలో ఒకటి. ఇపుడీ SSMB29 హక్కులు RRRను మించి ఉంటుందని సమాచారం. అయితే, ఈ డీల్ గురించి నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
SSMB29 సినిమా కథ అమెజాన్ అడ్వెంచర్ మాత్రమే కాకుండా,టెక్నాలజీ,మిస్టరీ,సైన్స్ ఫిక్షన్,మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి.
ALSO READ : Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర'.. వీఎఫ్ఎక్స్ తో అద్భుతం చేయబోతుందా?
ఈ మేరకు హైదరాబాద్‌లో భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ఇకపోతే, దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.