Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర'.. వీఎఫ్ఎక్స్ తో అద్భుతం చేయబోతుందా?

Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర'..  వీఎఫ్ఎక్స్ తో అద్భుతం  చేయబోతుందా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు 'విశ్వంభర' మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త ఆఫ్ డేట్ ఇచ్చారు.  సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయని తెలిపింది.  ఇది భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని పేర్కొంది.  ఈ చిత్రం అద్భుతమైన వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని, ఇండియన్ సినిమాకు ఒక కొత్త ఊపునిస్తుందని చిత్ర బృందం ఘంటాపథంగా చెబుతుంది.

మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?
ఇప్పటికే పలుసార్లు విశ్వంభర మూవీ విడుడల వాయిదా పడడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు.  జనవరిలో విడుదల చేస్తామని తొలుత మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ తర్వాత వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.  ఈ చిత్రాన్ని  తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  అన్ని పూర్తైతే త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ మేకర్స్ పేర్కొంది.

VFXతో అద్భుత సృష్టిస్తుందా?
ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, విజువల్స్ పరంగా ఒక అద్భుత సృష్టిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు కలిసి పనిచేస్తున్నాయి.  ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా, ఈ బృందాలు ప్రతీ చిన్న వివరాలపై కూడా ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 'విశ్వంభర' మేకింగ్ విషయంలో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని, ఇది కచ్చితంగా వేచి చూడదగినదని ప్రాజెక్ట్‌కు దగ్గరగా ఉన్న పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ALSO READ | WAR2: ఎన్టీఆర్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి.. నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

పురాణాలు, భావోద్వేగాలు,  అద్భుతమైన సినిమాటిక్ దృశ్యాల సమ్మేళనంతో ఒక భారీ కాన్వాస్‌పై 'విశ్వంభర' రూపుదిద్దుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు .విజువల్ స్టోరీటెల్లింగ్‌కు ఛోటా కె. నాయుడు తన కెమెరా పనితనంతో ప్రాణం పోయగా, ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ 'విశ్వంభర' అనే అద్భుతమైన ప్రపంచాన్ని అత్యంత నిశితంగా రూపొందించామని మూవీ మేకర్స్ వెల్లిడించారు.