OTT Movies: ఓటీటీలోకి కొత్తగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇవే..

OTT Movies: ఓటీటీలోకి కొత్తగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇవే..

OTTలో కొత్త సినిమాల సందడి ఆడియన్స్లో కొత్త ఉత్సాహం పెంచుతోంది. ఈ జులై మొదటివారంలో ఏకంగా 30కి పైగా సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వివిధ భాషలలో క్రైమ్, హార్రర్, యాక్షన్, కామెడీ జోనర్స్లో సినిమాలున్నాయి. వాటితోపాటు పలు ఇంట్రెస్టింగ్ షోలు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో ఇంగ్లీషు సినిమాలే ఉన్నాయి. అలాగే, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనేది? ఓ లుక్కేద్దాం. 

జియో హాట్‌స్టార్:

గుడ్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ తమిళ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా)- జూలై 4

ALSO READ : ఐశ్వర్యరాయ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అబిషేక్ బచ్చన్.

లా అండ్ ది సిటీ (కొరియన్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 5

కంపానియన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్&హారర్)- జూన్ 30

ఆహా తెలుగు:

శ్రీ శ్రీ శ్రీ రాజావారు (తెలుగు ఫ్యామిలీ డ్రామా)- జూలై 4

ఆహా తమిళ్:

పరమశివన్ ఫాతిమా (తమిళ హారర్ థ్రిల్లర్)- జూలై 4

ఈటీవీ విన్:

AIR:ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3

జీ5:

కాళీధర్ లపతా (హిందీ క్రైమ్ థ్రిల్లర్)- జూలై 4

సోనీలివ్:

ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 4

అమెజాన్ ప్రైమ్:

ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02

ఉప్పు కప్పురంబు (తెలుగు మూవీ)- జూలై 04

ఆషి హై జమ్వా జమ్వీ (మరాఠీ ఫ్యామిలీ)- జూలై 4

ది కిల్లర్స్ షాపింగ్ షాపింగ్ లిస్ట్ (సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్)-జూలై 4

బ్రేకింగ్ 4 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 4

పూణె హైవే (హిందీ క్రైమ్ థ్రిల్లర్)- జూలై 4

నెట్‌ఫ్లిక్స్‌:

అటాక్ ఆన్ లండన్‌- హంటింగ్‌ ది 7/7 బాంబర్స్- జూలై 01

ది ఓల్డ్‌ గార్డ్-2- జూలై 02

థగ్ లైఫ్‌ (తెలుగు, తమిళ యాక్షన్ థ్రిల్లర్)- జూలై 3

ది శాండ్‌మాన్ సీజన్-2- జూలై 03

బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3

అన్-ఎక్స్ యూ (ఫిలిపినో రొమాంటిక్ కామెడీ)- జూలై 3

ఆల్ ది షార్క్స్ (అడ్రినలిన్-ఇంధన పోటీ సిరీస్)- జూలై 4

ది సమ్మర్‌ హికరు డైడ్- జూలై 05

లయన్స్‌గేట్ ప్లే:

ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ ఫాంటసీ)- జూలై 4

అపోకలిప్టో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్)- జూలై 4

సన్ నెక్ట్స్:

జగమెరిగిన సత్యం (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్)- జూలై 4

మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమిళ థ్రిల్లర్)- జూలై 4

ఈ మూవీస్ అన్నీటీలో గుడ్ వైఫ్, శ్రీ శ్రీ శ్రీ రాజావారు, AIR:ఆల్ ఇండియా ర్యాంకర్స్, థగ్ లైఫ్, ఉప్పు కప్పురంబు, ది ఓల్డ్‌ గార్డ్ 2, జగమెరిగిన సత్యం, మద్రాస్ మ్యాట్నీ, ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు వంటి సినిమాలు తెలుగులో చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటితో పాటు ఇతర భాషల సినిమాలు సైతం తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీకెండ్లో వచ్చిన ఈ కొత్త సినిమాలతో ఆడియన్స్కు మంచి టైంపాస్ అని చెప్పొచ్చు. మరి ఆలస్యం ఎందుకు ఎంచక్కా చూసేయండి!