జొమాటో, స్విగ్గీలో పెరగనున్న ఫుడ్ డెలివరీ ఖర్చులు

జొమాటో, స్విగ్గీలో పెరగనున్న ఫుడ్ డెలివరీ ఖర్చులు

న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ, మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులను పెంచడంతో పాటు, సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ ఛార్జీలకు 18శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వర్తించనుండడంతో కస్టమర్లపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ కొన్ని మార్కెట్లలో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజును రూ.15 (జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ సహా)కి పెంచింది.

జొమాటో రూ.12.50 (జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ మినహాయించి)కి, మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.12కి పెంచింది. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వల్ల జొమాటో వినియోగదారులకు రూ.2, స్విగ్గీ వినియోగదారులకు రూ.2.6 అదనపు భారం పడనుంది. మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే 18శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ చెల్లిస్తున్నందున వినియోగదారులపై ప్రభావం ఉండదని తెలిపింది. ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫీజులు సంస్థలకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్నాయి.