ఫుడ్​ డెలివరీ స్టార్టప్​ స్విగ్గీకి రూ.4 వేల165 కోట్ల నష్టం

ఫుడ్​ డెలివరీ స్టార్టప్​ స్విగ్గీకి  రూ.4 వేల165 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఫుడ్​ డెలివరీ స్టార్టప్​ స్విగ్గీకి  2022–-23 ఆర్థిక సంవత్సరంలో 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,165 కోట్లు) నష్టం వచ్చింది.  తక్కువ వేతన చెల్లింపులు,  మార్కెటింగ్ ఖర్చుల్లో కోతలు నష్టాలను తగ్గించడంలో సహాయపడ్డాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్  వరకు మధ్యకాలంలో స్విగ్గీ నష్టాలు 207 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో సంస్థకు 1.02 బిలియన్​ డాలర్ల నష్టం వచ్చింది. అంతకుముందు సంవత్సరం ఇదేకాలంలో 1.02 బిలియన్ల డాలర్ల  నష్టం వాటిల్లింది. 2022లో పెట్టుబడిదారుల లెక్క  ప్రకారం స్విగ్గీ విలువ 10.7 బిలియన్​ డాలర్లు.