గగన్ యాన్: అంతరిక్షంలో భారత వ్యోమోగాముల ఫుడ్ ఇదే

గగన్ యాన్: అంతరిక్షంలో భారత వ్యోమోగాముల ఫుడ్ ఇదే

మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ కు నలుగురిని ఫైనల్ చేసింది ఇస్రో. ఎనిమిదిమందితో కూడిన బృందం రష్యాలో శిక్షణ పొందగా… వీరిలో నలుగురిని ఎంపిక చేశామన్నారు ఇస్రో చైర్మెన్ శివన్. అయితే వారి గురించిన సమాచారాన్ని ఇప్పుడే బయటకు తెలపలేదు. అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమోగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వీరికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఇందుకు గాను ఫుడ్ మెను విడుదల అయింది.

ఆహార పట్టికలో ఇడ్లీ, మూంగ్ దాల్, హల్వా, వెజ్ పులావ్, ఎగ్ రోల్స్ ను ప్రిపేర్ చేసింది డెఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లాబొరేటరి. దీంతో పాటు ఫుడ్ హీటర్స్ ను వ్యోమోగాములకు అందుబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది చివర్లో లేదా 2022లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఇస్రో రెడీ అవుతుంది.