టిఫిన్ లో పురుగులు..15 మంది విద్యార్థినులకు అస్వస్థత

టిఫిన్ లో పురుగులు..15 మంది విద్యార్థినులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్ధినులను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం చేసిన టిఫిన్ లో పురుగులు రావడం విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వాంతులు, కడుపునొప్పితో బాలికలు రోదిస్తున్నారు.