13 మంది మున్సిపల్​ కార్మికులకు ఫుడ్​పాయిజనింగ్!

13 మంది మున్సిపల్​ కార్మికులకు ఫుడ్​పాయిజనింగ్!
  •     రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఘటన 

షాద్ నగర్, వెలుగు : షాద్ నగర్ టౌన్​లో ఫుడ్​పాయిజనింగ్​అయి 13 మంది మున్సిపల్​కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్​అధికారులు మంగళవారం టౌన్​లో ‘స్వచ్ఛదనం-– పచ్చదనం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్​కార్మికుల కోసం స్థానిక హోటల్​నుంచి ఫుడ్​తెప్పించారు. అయితే భోజనం చేశాక మున్సిపల్​కార్మికులకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్నను వివరణ కోరగా కార్మికుల కోసం భోజనాలు తెప్పించామని, ఎప్పటిలాగే స్థానిక హోటల్​కు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. భోజనం చేశాక కార్మికులు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఫుడ్​శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని వెల్లడించారు. బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లడంతో అస్వస్థతకు గురయ్యారా? లేక ఫుడ్​పాయిజనింగ్​జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.