కస్తూరిబా బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్

కస్తూరిబా బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్
  • 20 మంది విద్యార్థులకు అస్వస్థత
  • హాస్టల్ బయట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

నిర్మల్ జిల్లా: భైంసాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురుకుల హాస్టల్ బయట ఆందోళనకు దిగారు. అన్నంలో పురుగులు వచ్చాయని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం వల్లే ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్నారు. పురుగుల అన్నం తినలేక పదుల సంఖ్యలో విద్యార్థినుల అస్వస్థతకు గురయ్యారు.

గత 5 రోజుల నుండి అన్నంలో పురుగులు రావడంతో స్నాక్స్ తిని ఉంటున్నాం విద్యార్థినిలు చెబుతున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని.. సరిగా వండడం లేదని హాస్టల్ సిబ్బందికి, వార్డెన్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేక పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యారని  పలువురు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. గతంలో సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పిన నాయకులు, అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.