ఫుడ్ పాయిజన్ .. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

 ఫుడ్ పాయిజన్ ..  20 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్ కారణంగా 20  మంది విద్యార్థిణులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చోటుచేసుకుంది. 15 మందిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, ఐదుగురు విద్యార్థినిలను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఎవరకి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. అయితే  ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలు తేలియాల్సి ఉంది.