మదర్సాలో ఫుడ్ పాయిజన్.. 10 మంది విద్యార్థులకు అస్వస్థత

మదర్సాలో ఫుడ్ పాయిజన్.. 10 మంది విద్యార్థులకు అస్వస్థత

రామాయంపేట, వెలుగు: మెదక్​జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‎లోని ఓ మదర్సాలో చదువుకుంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్‎తో అస్వస్థతకు గురయ్యారు. మదర్సాలో 25 మంది చదువుకుంటుండగా, సోమవారం రాత్రి వీరిలో 10 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. నిర్వాహకులు వెంటనే రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‎కు తరలించారు. 

అక్కడ  చికిత్స పొందుతున్న వారిని మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేంత వరకు వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కలెక్టర్​ఆదేశించారు. ఘటన వివరాలు తెలుసుకునేందుకు మెడికల్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్​వెంట డీసీహెచ్ శివ దయాల్ ఉన్నారు.