
చిత్తూరు : చిన్నగోరంట్లపల్లెలోని కల్తీపాల తయారీ కేంద్రం పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కల్తీపాలు తయారుచేసే సంజీవరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాలు, నీళ్ళు, యూరియా, సన్ ఫ్లవర్ నూనెతోపాటు జ్యూస్ మిక్సర్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే సంజీవరెడ్డి ఇంటిపై తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కె.వి.పల్లి ఎస్‌ఐ రామ్మోహన్ రంగంలోకి దిగారు. సంజీవ రెడ్డి పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.