ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. గ్రౌండ్‌లోనే చనిపోయిన ప్లేయర్

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. గ్రౌండ్‌లోనే చనిపోయిన ప్లేయర్

ఫుట్ బాల్ మైదానంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (జనవరి 11) నాడు ఇండోనేషియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్లేయర్ ప్రాణాలు విడిచాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఆటగాడు   మైదానంలో సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అతడిపై మెరుపు పడింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. 

ఈ సంఘటన చూసిన సహచర ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ప్లేయర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయాయడు. పిడుగుపాటు కారణంగా ఫుట్‌బాల్ ప్లేయర్ ఇలా మరణించడం సహచరులను తీవ్ర  దిగ్భ్రాంతిని మిగిల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నెటిజన్స్ దీనిపై విచారం వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.