అసెంబ్లీ బరిలో అఖిలేష్ 

అసెంబ్లీ బరిలో అఖిలేష్ 

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ, ఎస్పీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు సంబంధిత పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో..ఎస్పీ చీఫ్ అఖిలేష్ పై ఒత్తిడి పెరిగింది. అందుకే అఖిలేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని..ప్రతి అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టి అనూహ్యంగా ఎన్నికల రేస్ లోకి దూసుకొచ్చారు. ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ తూర్పు యూపీలోని అజంగఢ్ నుంచి లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. అఖిలేష్ తూర్పు యూపీ నుంచి లేదా హై-ప్రొఫైల్ కలిగిన లక్నో వంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది. 

మరిన్ని వార్తల కోసం

అఖిలేశ్ అబద్ధాల మెషిన్లా మారారు 

టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె