అఖిలేశ్ అబద్ధాల మెషిన్లా మారారు

అఖిలేశ్ అబద్ధాల మెషిన్లా మారారు

ఉత్తరప్రదేశ్ లో అధికారం కోసం రాజకీయ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు హామీలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే ఉచిత విద్యుత్ హామీ అస్త్రాన్ని సంధించారు. దీనిపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు చీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ అబద్ధాలు చెప్పే ఆటోమెటిక్ మిషన్ లాగా మారిపోయారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని అఖిలేష్ ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేశారు.

అఖిలేష్ హయాంలో కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు కనిపించకుండా పోయాయని....అలాంటి వ్యక్తి ఉచిత కరెంట్ పై పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అఖిలేష్ ఇస్తున్న హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మౌర్య ట్వీట్ చేశారు. ఎస్పీ తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మరని చెప్పారు. అయితే సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రాగానే డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నవారు..భవిష్యత్తులో వాటిని తీసుకోవాలకునే వారు ఫారమ్ ను పూర్తి చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని అఖిలేష్ సూచించారు. 

మరిన్ని వార్తల కోసం

కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు