కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 2.82 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 441 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారంతో పోల్చితే దాదాపు 13 వేల కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 18.31 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 8,961 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోల్చితే ఒమిక్రాన్ కేసులు 0.79 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, కర్ణాటకలో కరోనా పంజా విసురుతోంది. కేవలం రెండ్రోజుల్లోనే అక్కడ డబుల్ కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 22 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మంగళవారం ఒక్కరోజే అక్కడ 41 వేల కేసులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో 39 వేల కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి 53 మంది మరణించారు. గుజరాత్ లో మరో 17 వేల కేసులు వచ్చాయి. కరోనాతో 10 మంది చనిపోయారు. తమిళనాడులో 23 వేల పైచిలుకు కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 29 మంది మరణించారు. కేరళలో 28 వేలకు పైగా కేసులొస్తే.. ఆంధ్రప్రదేశ్ లో 6 వేల పైచిలుకు కేసులొచ్చాయి. 

మరిన్ని వార్తల కోసం: 

ఐదు రోజుల బేబీకి కరోనా టెస్ట్

మోడీ స్పీచ్పై రాహుల్ సెటైర్లు

ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో జై భీమ్