మోడీ స్పీచ్పై రాహుల్ సెటైర్లు

మోడీ స్పీచ్పై రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ:  వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సోమవారం నిర్వహించిన దావోస్ ఎజెండా 2022 వర్చువల్ సమిట్​లో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్​కు అంతరాయం కలగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోడీ అబద్ధాలను చివరకు టెలీప్రాంప్టర్ (స్పీచ్​ను చదివేందుకు వీలుగా స్పీచ్ ఇచ్చే వ్యక్తులకు ఎదురుగా ఉంచే డివైస్) కూడా తట్టుకోలేదంటూ ఆయన మంగళవారం హిందీలో ట్వీట్ చేశారు. మోడీ స్పీచ్​కు అంతరాయంపై సోషల్ మీడియాలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. ‘‘టెలీప్రాంప్టర్​తో మీరు స్పీచ్ ఇవ్వవచ్చు. కానీ దానిని శాసించలేరు. నిన్న మొత్తం దేశానికి ఈ విషయం అర్థమైంది” అంటూ కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. టెలీప్రాంప్టర్ ఫెయిల్ కావడంతో మోడీ స్పీచ్ ఇవ్వలేకపోయారంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆయనను ‘టెలీప్రాంప్టర్ గై’ అంటూ ఎద్దేవా చేసింది. అయితే, ప్రధాని మోడీ హిందీలో స్పీచ్ ప్రారంభించగానే  ఆయనను, ట్రాన్స్ లేటర్ ను కనెక్ట్ చేయడంలో దావోస్​లోని ఆర్గనైజర్లు ఫెయిల్ అయ్యారని, కొద్దిసేపటి తర్వాత స్పీచ్ మళ్లీ ప్రారంభించాలని అడగడంతో మోడీ రీస్టార్ట్ చేశారని బీజేపీ నేతలు తజీందర్ పాల్ సింగ్ బగ్గా, తదితరులు చెప్పారు.  సమిట్ ఆర్గనైజర్ల వల్ల జరిగిన టెక్నికల్ లోపానికే ఇంతగా ఎగ్జైట్ మెంట్ ఎందుకని కౌంటర్ ఇచ్చారు.

టెలీప్రాంప్టర్ అంటే ఏమిటి? 

న్యూస్ రీడర్లు, స్పీచ్ ఇచ్చే వ్యక్తులు స్పీచ్ ను, స్క్రిప్టును చదివేందుకు వీలుగా వారికి ఎదురుగా టెక్స్ట్ ను చూపించే డివైస్ లేదా ప్యానెలే టెలీప్రాంప్టర్. సాధారణంగా న్యూస్ రీడర్ల ఎదురుగా ఉంచే కెమెరా కు కొంచెం కింద ఈ డివైస్​ను ఉంచుతారు. అయితే, ప్రధాని ఉపయోగించే టెలీప్రాంప్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీనిని కాన్ఫరెన్స్ టెలీప్రాంప్టర్ అంటారు. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడేటప్పు డు చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్యానెల్ ఉంటుంది. అది టెలీప్రాంప్టర్​గా కూడా పనిచేస్తుంది. మామూలు టెలీప్రాంప్టర్లు స్పీచ్ ఇచ్చే వ్యక్తులకు ఎదురుగా ఉంటే.. ఈ టెలీప్రాంప్టర్ పూర్తిగా నేలపై ఉంటుంది. దీని ఎల్​సీడీ మానిటర్ నుంచి టెక్స్ట్ గ్లాస్ ప్యానెళ్లపై పడుతుంది. ఆ టెక్స్ట్ స్పీచ్ ఇచ్చే వ్యక్తికి, ఆపరేటర్​కు మాత్రమే కన్పిస్తుంది. స్పీకర్ మాట్లాడుతున్న స్పీడ్ ను బట్టి, టెక్స్ట్ ను ఆపరేటర్ రన్ చేస్తుంటాడు.