సోషల్ మీడియాలో చర్చలను అరికట్టలేం

సోషల్ మీడియాలో చర్చలను అరికట్టలేం

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో జరిగే చర్చలు లేదా వాక్ స్వేచ్ఛ కోసం జరిగే చర్చలపై వ్యాజ్యాలను ఆహ్వానించబోమని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. అరుదైన ఘటనల్లో మాత్రమే ధిక్కార కేసులను సుప్రీం కోర్టు స్వీకరిస్తుందని వేణుగోపాల్ తెలిపారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువర్చిన కొన్ని కేసుల విషయంలో ట్విట్టర్ లాంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌లో నెటిజన్స్ విమర్శిస్తున్నారు. దీని గురించి వేణుగోపాల్‌‌ను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.

‘ప్రజాస్వామ్య దేశంలో సోషల్ మీడియాలో చర్చలను అరికట్టలేం. ఇలాంటి విషయాల్లో నియమాలను అతిక్రమిస్తే తప్ప సుప్రీం కోర్టు స్పందించదు. వీటిని వద్దనాల్సిన అవసరం లేదు. ఈ స్వేచ్ఛను తగ్గించే చర్యలకు ప్రభుత్వం పాల్పడకూడదు. మనకు బహిరంగ చర్చలు, బహిరంగ ప్రజాస్వామ్యం అవసరం చాలా ఉంది. ఇలాంటి విషయాల్లో ధిక్కారానికి పాల్పడకపోతే తప్ప సుప్రీం జోక్యం చేసుకోబోదు’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు.