
ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ మరింత పటిష్టమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ‘‘ఒక్క ఇండియన్ జవాన్ అమరుడైతే, 10 మంది శత్రువులు చస్తారన్న’’ విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా జాట్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలమో కాదో రాహుల్, శరద్ పవార్‌లు క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్- ఎన్సీపీ సర్కార్లు ఇంతకుముందు రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.