ఆనాడు ఉద్యమం కోసం..నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు

ఆనాడు ఉద్యమం కోసం..నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు

తెలంగాణ లో కేసీఆర్ సీఎం గా ఉన్నారు..రుణమాఫీ చేస్తామని చెప్పారని దాని కోసం 39 లక్షల మంది ఎదురు చూస్తున్నారన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్త అన్నారు.. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు..అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో భాగంగా ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో దీక్ష చేశారు. ఇందులో భాగంగా మాట్లాడారు. ఆనాడు ఉద్యమం కోసం 12వందల మంది ఆత్మహత్య చేసుకుంటే..నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. అంతేకాదు 15 లక్షల మంది పెన్షన్స్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారని అన్నారు.

దివంగత సీఎం వైఎస్సార్ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారని..రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు వైఎస్ షర్మిల. ఆరోగ్య శ్రీ లక్షలాది మంది జీవితాలను కాపాడారు..108 ప్రవేశ పెట్టారు అన్నారు.5 ఏళ్లల్లో ఒక్క రూపాయి పెంచకుండా, ఒక్క ట్యాక్స్ లేకుండా చేశారన్నారు. ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ గడిలో బందీ అయ్యిందని విమర్శించారు. 

తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్న షర్మిల..అసమర్థ సీఎం కి అవసరమా సీఎం పోస్ట్ అని ప్రశ్నించారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలో ఉద్యోగాలు ఇస్తే అన్ని ఉద్యోగులు భర్తీ అవుతాయన్నారు. ఇంటికి ఉద్యోగమైనా ఇవ్వాలి లేదంటే నిరుద్యోగ  భృతి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1 లక్ష 91 ఉద్యోగాలు భర్తీ చేయలేని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్న వైఎస్ షర్మిల..తెలంగాణలో ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందన్నారు.