సైక్లింగ్ చేస్తుంటారా..? రాత్రిళ్లు అయినా.. రద్దీ రోడ్లైనా.. ఈ కిట్ ఉంటే నో ఫియర్

సైక్లింగ్ చేస్తుంటారా..? రాత్రిళ్లు అయినా.. రద్దీ రోడ్లైనా.. ఈ కిట్ ఉంటే నో ఫియర్

క్లీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సైకిల్‌ చైన్‌కు పెద్దగా ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండదు. కాబట్టి తొందరగా దుమ్ము చేరుతుంది. అలాంటప్పుడు ఈ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని యూడీ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీంతో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అన్ని రకాల సైకిల్‌ చైన్లకు దీన్ని వాడుకోవచ్చు. 

దీనిలోని చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నచ్చిన క్లీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్విడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నింపాలి. ఆ తర్వాత కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అమర్చి, పెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొక్కుతూ క్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిప్పితే సరిపోతుంది. ఇందులోని చైన్ స్క్రబ్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని హెవీ డ్యూటీ క్వాలిటీ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. 

ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎక్కువగా సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు రైడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవసరమయ్యే కొన్ని వస్తువులు, ఫస్ట్ ఎయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివి వెంట తీసుకెళ్తుంటారు. అలాంటివాటిని పెట్టుకునేందుకే గోల్డెన్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ ప్రత్యేకంగా ఈ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చింది. దీన్ని సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు భాగంలో ఉండే ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. అన్ని రకాల సైకిళ్లకు ఇది సరిపోతుంది. ఇందులో -1.5 లీటర్ల స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. 

ప్రైమరీ షెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తేలికైన నైలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, రెండో షెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. ఈ రెండింటితోపాటు జిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కూడా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ ఉంటుంది. దీనికి రెండు పట్టీలు ఉంటాయి. వాటికి ఉండే పుష్ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఈజీగా ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తగిలించొచ్చు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా మొబైల్ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. రైడింగ్ చేసేటప్పుడు టచ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేయడానికి కూడా ఇది సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. 


సేఫ్టీ సిగ్నల్ లైట్ 

వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల మీద సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు ఈ సైకిల్ టెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్లు ఉంటే ఆ ప్రమాదాల నుంచి కొంతైనా తప్పించుకోవచ్చు. ఈ టెయిల్ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండువైపులా పసుపు రంగుల్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీలు ఉంటాయి.  ఇందులోని కుడి, ఎడమ రెక్కలను విడివిడిగా కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. 

ఇవి ఇండికేటర్లలా పనిచేస్తాయి. అంటే టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దగ్గర ఎటువైపు మళ్లుతున్నామో వెనుక నుంచి వచ్చేవాళ్లకు ఇండికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చు. ఈ రెండు లైట్లకు మధ్యలో సాలిడ్ రెడ్ లైట్ ఉంటుంది. దీన్ని ఫ్లాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కూడా వాడొచ్చు. రాత్రిపూట మాత్రమే కాదు పగటిపూట కూడా ఇవి బాగా కనిపిస్తాయి. 

హై క్వాలిటీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేసినందువల్ల అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. వాన, పొగమంచు, తేమతో కూడిన వాతావరణంలో కూడా హాయిగా వాడుకోవచ్చు. దీన్ని కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ప్రత్యేకంగా రిమోట్ కూడా ఉంటుంది. దాన్ని సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండిల్ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీటు కింది భాగంలో బిగించుకోవచ్చు. ఇందులో 400mAh బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీతో చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.