సౌదీ వీసాలకు ఇక పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు

సౌదీ వీసాలకు ఇక  పోలీస్  క్లియరెన్స్ అక్కర్లేదు

సౌదీ అరేబియా వీసా కోసం అప్లై చేసేందుకు ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను తొలగించామని వెల్లడిస్తూ భారత్ లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం, బలమైన స్నేహ సంబంధాల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. దాదాపు 20 లక్షల మందికిపైగా భారతీయులు సౌదీ అరేబియాలో సంతోషంగా ఉంటున్నారని తెలిపింది.  

ఈ నిర్ణయం వల్ల సౌదీ అరేబియా వీసాల కోసం వచ్చే దరఖాస్తులను ఆమోదించే సమయం చాలావరకు తగ్గనుంది. టూరిజం కోసం సౌదీకి వెళ్లే భారతీయులు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్‌ బిన్‌ సల్మాన్ ఈ నెలలో భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయ్యింది.