ఫోర్బ్స్‌ జాబితాలో తొమ్మిదేళ్ల బాలుడు

ఫోర్బ్స్‌ జాబితాలో తొమ్మిదేళ్ల బాలుడు
ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో అత్యధిక మనీ పొందిన యూట్యూబర్‌గా తొమ్మిదేళ్ల బాలుడు నిలిచాడు. బాలుడి పేరు ర్యాన్‌ కాజి. వరుసగా మూడో సంవత్సరం ఈ జాబితాలో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ర్యాన్‌ నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌ పేరు ‘ర్యాన్స్‌ వరల్డ్‌’. ఈ ఛానెల్‌ 2020 సంవత్సరానికి 29.5 మిలియన్లను సంపాదించింది. పిల్లల ప్రకటనలపై కంట్రోల్ ఉండటంతో ర్యాన్‌ ఆదాయం తగ్గింది. లేకపోతే.. ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందేవాడు. ర్యాన్‌ కాజీ అసలు పేరు ర్యాన్‌ గువాన్‌. అతను నాలుగేళ్ల వయస్సు నుంచే… వీడియోలను  రూపొందించడం ప్రారంభించాడు. మూడో తరగతి చదువుతున్నర్యాన్‌.. తన కుటుంబంతో కలిసి తొమ్మిది యూట్యూబ్‌ ఛానెల్స్‌ను నడుపుతున్నాడు. ర్యాన్‌ వరల్డ్‌ చానెల్‌కు మొదట ‘ర్యాన్‌ టార్సు రివ్యూ’ అని పేరు పెట్టారు. ఈ ఛానెల్‌లో ప్రముఖంగా… టారు రివ్యూస్‌, మూవీ కార్స్‌, అన్‌బాక్సింగ్‌ వీడియోలు వైరల్‌ కావడంతో యూట్యూబ్‌ ఖ్యాతి పెరిగింది. ‘ర్యాన్‌ వరల్డ్‌’ 27.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌తో ఫేమస్ అయ్యింది. అలాగే ఈ ఛానెల్‌లో ఫన్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ వీడియోలు, సైన్స్‌ ప్రయోగాల క్లిప్పింగ్స్‌ ర్యాన్‌ అప్పుడప్పుడూ తన సోదరీమణులతో కలిసి పంచుకుంటాడు.