పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించింది.. మేం కూడా అదే రేంజులో బదులిచ్చాం: భారత్

పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించింది.. మేం కూడా అదే రేంజులో బదులిచ్చాం: భారత్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ దాడులు తీవ్రతరం చేసిందని భారత విదేశాంగ వెల్లడించింది. దేశంలోని 15 ప్రాంతాల్లో దాడులకు పాక్ ప్రయత్నించిందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాయి. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా, విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో అదే రేంజులో భారత్ ప్రతిదాడులు చేసిందని తెలిపారు. పాకిస్థాన్‎లోని లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేశామని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ తన దాడుల తీవ్రత పెంచిందని.. మోర్టార్లు, బాంబులు ఉపయోగిస్తోందన్నారు. మేం పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడులు చేశాం. కానీ పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. గురువారం (మే 7) రాత్రి భారత పశ్చిమ, ఉత్తర సైనిక స్థావరాలపై పాక్ దాడికి ప్రయత్నించింది. 

►ALSO READ | Reliance: ఆపరేషన్ సిందూర్ పై వెనక్కితగ్గిన రిలయన్స్.. ఏమైందంటే..

పాక్ దాడులను భారత్ సాయుధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. పాక్ మిస్సైల్స్ శిధిలాలు అనేక చోట్ల గుర్తించారు. ఎల్వోసీ వెంబటి పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో 15 మంది పౌరులు మృతి చెందారు. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ పౌరులు  చనిపోయారనేది అవాస్తవం. అలాగే, పాక్‎లోని ప్రార్థనా స్థలాలపై దాడులు చేయమనేది వాస్తవం కాదు. పాకిస్తాన్ మాత్రం సిక్కుల లక్ష్యంగా కాశ్మీర్లోని గురుద్వార్‎లో దాడులు చేసింది. పాక్ గురుద్వారాపై చేసిన దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారని తెలిపారు.