విదేశీ పక్షులు విడిదికొస్తున్నయ్! వేల కిలో మీటర్లు ప్రయాణించి కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ కు వచ్చాయి.

విదేశీ పక్షులు విడిదికొస్తున్నయ్! వేల కిలో మీటర్లు ప్రయాణించి కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ కు వచ్చాయి.

వింటర్ సీజన్ సమీపిస్తుండగా విదేశీ పక్షులు విడిదికొస్తున్నాయి. వేల కిలోమీటర్ల నుంచి వలస వచ్చి చూపరులను కనువిందు చేస్తున్నాయి. యూరప్, యూకేకు చెందిన లిటిల్ టర్న్, గార్గానీ డక్స్, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన గ్లాసీ ఐబిస్ కొంగలు, సహారా ఆఫ్రికా తడి భూముల్లోని నాబ్ బిల్డ్ డక్స్, స్మాల్ ప్రాంటిన్కోల్ పక్షి, గ్రే బిల్డ్ కుక్ పెయింటెడ్ స్టార్క్ లు, ఆసియాలోని గ్రే బిల్డ్ కుకూ పక్షులు ఇప్పటికే వలస వచ్చాయి. 

హిమాలయ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి కూడా పక్షులు కొద్ది రోజులుగా కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ కి వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో ఉష్ణమండల ప్రాంతమైన తెలంగాణలోని అడవులకు వచ్చి చెరువుల వద్ద  సేదతీరుతు న్నాయి. సమ్మర్ సీజన్ మొదలవగానే తిరిగి వెళ్లిపోతాయి. ప్రస్తుతం కాగజ్ నగర్ అడవుల్లో సుమారు 300 పక్షి జాతులు ఉన్నట్లు ఎఫ్ డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే చెప్పారు.