దివాలాకు బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీలో పిటీషన్ ఫైల్ చేసిన ఫారిన్ లెండర్లు

దివాలాకు బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీలో పిటీషన్ ఫైల్ చేసిన ఫారిన్ లెండర్లు

 న్యూఢిల్లీ : బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దివాలా కోర్టులో పిటీషన్ ఫైల్ అయ్యింది. కంపెనీకి  1.2 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చిన ఫారిన్ లెండర్లలో 85 శాతం మంది  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ) బెంగళూరు బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పిటీషన్ ఫైల్ చేశారు. అంటే కంపెనీ తన ఆస్తులు అమ్మి అయినా లోన్ తీర్చాల్సి ఉంటుంది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీకి తొందరపడి వెళుతున్నారని బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టుల్లో కేసు నడుస్తోందని  వెల్లడించింది.  రైట్స్ ఇష్యూకు బైజూస్ వెళ్లాలని చూస్తోంది.

ఇలాంటి టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెండర్లు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీకి వెళ్లడం గమనించాలి. లోన్  టెర్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   సవరించడానికి కిందటేడాది జులైలో లెండర్ల స్టీరింగ్ కమిటీతో  బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయినప్పటికీ  ఫారిన్ లెండర్లు ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీకి వెళ్లారు. ఓ పెద్ద లా కంపెనీని నియమించుకున్నారని, దివాలా ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ కంపెనీ ఫాలో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, 2021 లో ఫారిన్ లెండర్ల నుంచి టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్ ఫెసిలిటీ (టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) కింద 1.2 బిలియన్ డాలర్ల  లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బైజూస్ పొందింది. తర్వాత ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ పెట్టిందని లెండర్లు చెబుతున్నారు. ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా అయినా వాడుకోవడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్లు లేవని కంపెనీ వాదిస్తోంది.