ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేయాలి

ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేయాలి
  • ఫోరెన్సిక్  పోస్ట్​గ్రాడ్యుయేట్ల వినతి 

హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఎస్ఎల్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో  సవరణలు చేయాలని ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఎస్ఎల్ పీఆర్ బీ​తాజా నోటిఫికేషన్‌లోని ఎఫ్ఎస్ఎల్​పోస్టుల రిక్రూట్‌మెంట్ నిబంధనలు అశాస్త్రీయంగా ఉన్నాయని ఆరోపించారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో దాదాపు 600 మంది ఫోరెన్సిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు వచ్చారని, రిక్రూట్‌మెంట్ ప్రమాణాల్లో ఫోరెన్సిక్ స్కిల్స్ ప్రాధాన్యతను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. 

డీఎన్ఏ ప్రొఫైలింగ్, టాక్సీకాలజీ, బాలిస్టిక్స్, సీరాలజీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ వంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టుల్లో తాము పొందిన శిక్షణను అణగదొక్కేలా అర్హతలను రూపొందించారని ఆరోపించారు. ఫోరెన్సిక్ పోస్టులను జనరల్ సైన్స్ పరీక్షల ద్వారా అంచనా వేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్​లో సవరణలు చేయాలని కోరారు.