ఫారెస్ట్ ఆఫీసర్ అంత్యక్రియలకు హాజరైన మంత్రులు

ఫారెస్ట్ ఆఫీసర్ అంత్యక్రియలకు హాజరైన మంత్రులు

గొత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మృతదేహానికి మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ అజయ్ కుమార్ నివాళులు అర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీనివాస్ స్వగ్రామం ఈర్లపుడిలో అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్, పువ్వాడ అజయ్ శ్రీనివాస్ పాడే మోసి నివాళి అర్పించారు.  శ్రీనివాస్ రావు మృతితో గ్రామంలో విషాచాయలు అలుముకున్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస్  కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఫారెస్ట్ అధికారులపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ జీవో జారీ చేశారన్నారు. పోడు భూముల సమస్యలను వచ్చే డిసెంబర్ లోపు కేసీఆర్ పరిష్కరిస్తామన్నారని చెప్పారు.