కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని అటవీశాఖ సిబ్బంది

V6 Velugu Posted on Jul 26, 2021

మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు రెచ్చిపోయారు. గూడూరు మండలం బొల్లేపల్లిలో పోడు రైతుల  భూములు స్వాధీనం చేసుకుని హరిత హారం మొక్కలు నాటించారు. గిరిజన రైతులు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా కనికరించలేదు. తమకు ఈ భూమే దిక్కని, భూములు లాక్కొవద్దని వేడుకున్నారు. ఐనా కనికరించని అటవీ శాఖ అధికారులు...వారిని తిట్టారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం గిరిజనుల జోలికి వస్తే ఊరుకోమంటూ మాటలు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఈ సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. సర్కార్ తీరుతో అటవీ శాఖ అధికారులతో పాటు గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. 

 

Tagged forest, mahabubabad, outrage, officials, podu Farmers

Latest Videos

Subscribe Now

More News