రూ.5 లక్షల విలువైన టేకు దుంగలు స్వాధీనం

రూ.5 లక్షల విలువైన టేకు దుంగలు స్వాధీనం

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా​  కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ సీతానగర్ విలేజ్ గొల్లగూడ సమీపంలోని పంట పొలాల వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను ఫారెస్ట్ ​అధికారులు పట్టుకున్నారు. కాగజ్ నగర్, పెంచికల్ పేట్ రేంజ్ సిబ్బంది మంగళవారం దాడులు చేశారు. 

రూ.5 లక్షల విలువైన  టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ అనిల్ కుమార్ తెలిపారు. దాడుల్లో డీఆర్ వో బాబు పటేకర్, ఎఫ్ఎస్ వోలు జగన్, కామరాజ్, మనోహర్, అస్మ, ఎఫ్ బీవోలు పాల్గొన్నారు..