ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కిడ్నాప్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కిడ్నాప్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌‌గిల్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 14న మెక్‌గిల్‌‌ను అతడి ఇంట్లో నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిసింది. ఆ తర్వాత అతడిని తీవ్రంగా కొట్టిన కిడ్నాపర్లు.. గన్ పెట్టి బెదిరించారని సమాచారం. అనంతరం అతడిని వదిలేశారని ఆస్ట్రేలియన్ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను ఆసీస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, లెగ్ స్పిన్నర్ అయిన మెక్‌గిల్ ఆస్ట్రేలియా జట్టు తరఫున 44 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో 208 వికెట్లు తీశాడు. లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేర్ వార్న్ ఉన్న టైమ్‌లో ఆడటంతో మెక్‌‌గిల్ బాగానే రాణించినా అతడికి అంతగా పేరు రాలేదు.