కేఎల్ రాహుల్ విఫలమవుతున్నా... ఎందుకు సెలక్ట్ చేస్తున్నరు

కేఎల్ రాహుల్ విఫలమవుతున్నా... ఎందుకు సెలక్ట్ చేస్తున్నరు

అన్ని ఫార్మాట్లలో వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్పై  భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్  ట్విట్ల దాడి చేస్తున్నాడు. ఫాంలేమితో తంటాలు పడుతూ టీమిండియాకు భారంగా మారిన కేఎల్ రాహుల్ను ఎందుకు సెలక్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. కేఎల్ రాహుల్ కంటే ధావన్, గిల్, మయాంక్ అగర్వాల్ బెటర్గా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. వెంటనే రాహుల్ ను జట్టులో నుంచి తొలగించాలని ట్విట్టర్లో వెంకటేష్ ప్రసాద్ డిమాండ్ చేస్తున్నాడు. 

గొప్పగా రాణించిందేమి లేదు

కేఎల్ రాహుల్ విదేశాల్లో గొప్పగా రాణించిందేమి లేదని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. అంతేకాదు గణాంకాలను కూడా వెల్లడించాడు. విదేశాల్లో కేఎల్ రాహుల్ 56 ఇన్నింగ్స్ లు ఆడితే ..30 సగటుతో 6 సెంచరీలు మాత్రమే కొట్టాడని చెప్పాడు. 5 అర్థసెంచరీలు సాధించాడని వెల్లడించాడు. సెంచరీలు, అర్థసెంచరీలు చేసిన మ్యాచులు మినహా..మిగతా గేముల్లో అతను తక్కువ స్కోర్లే నమోదు చేశాడని చెప్పుకొచ్చాడు. 

ధావన్ బెటర్..

విదేశాల్లో కేఎల్ రాహుల్ కంటే శిఖర్ ధావన్ కుమెరుగైన సగటు ఉందని వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ధావన్ 40 సగటుతో 5 సెంచరీలు సాధించాడాని చెప్పుకొచ్చాడు. స్వదేశంలోనూ ధావన్ మెరుగైన పర్ఫామెన్స్ చేశాడని..శ్రీలంక, న్యూజిలాండ్ పై సెంచరీలు కొట్టాడని గుర్తు చేశాడు. మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడతాడని ప్రశంసించాడు. అయితే మిగతా దేశాలపై సాధారణ పర్ఫామెన్స్ చేశాడని చెప్పాడు. కానీ సొంత గడ్డపై మయాంక్ మెరుగ్గా రాణించాడన్నాడు.  13 ఇన్నింగ్సుల్లో 70 సగటుతో 2 డబుల్‌ సెంచరీలు సాధించాడని తెలిపాడు. 

గిల్ కూడా ఓకే..

శుభ్ మన్ గిల్ కు తక్కువ అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకున్నాడని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. అతడు  విదేశాల్లో 14 ఇన్నింగ్సుల్లో 37 సగటు నమోదు చేశాడని చెప్పాడు. గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్ లో  గిల్ చేసిన 91 పరుగులు బెస్ట్ అన్నాడు. రహానే కూడా విదేశాల్లో మెరుగ్గానే రాణించాడని చెప్పాడు. 50 టెస్టుల్లో 40 సగటుతో  పరుగులు చేశాడని గుర్తు చేశాడు.