
నేరడిగొండ , వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లు అప్పులపాలయ్యారని కాంగ్రెస్బోథ్నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ ఆరోపించారు. నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఎల్లుల అశోక్ తోపాటు 70 మంది గ్రామస్తులు బుధవారం కాంగ్రెస్ లో చేరారు. గజేందర్వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతోందని, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్ద సర్పంచ్ లకు అవమానాలే తప్ప గౌరవం లేదని అశోక్ఆరోపించారు. అందుకే ఎమ్మెల్యేకు చెప్పి మరీ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంత్ రావు, యువజన కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాయిడి రవి, ఆత్మ డైరెక్టర్లు స్వామి, కుంట శంకర్, పాల శంకర్ తదితరులు పాల్గొన్నారు .