CBI మాజీ చీఫ్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కరోనా బారినపడి ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవాళ(శుక్రవారం)తెల్లవారుజామున 4.30 గంటలకు ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. రంజిత్ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి. డిసెంబరు 2012 నుంచి 2014 వరకు ఆయన CBI డైరెక్టర్‌గా పనిచేశారు. CBI డైరెక్టర్ పదవితో పాటు ITBPDG తదితర పలు కీలక హోదాల్లోనూ సేవలందించారు.
