వరద బాధితులకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఆర్థిక సాయం

వరద బాధితులకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఆర్థిక సాయం
  •  తెలంగాణ, ఏపీకి రూ.10 లక్షల చొప్పున విరాళం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీలోని వరద బాధితుల సహాయార్థం మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ఎన్వీ రమణ విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో చెక్​లను ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్​ల రెసిడెంట్ కమిషనర్లు గౌరవ్ ఉప్పల్, ఏపీ అడిషనల్ రెసిడెంట్ కమిష నర్ హిమాన్షు కౌశిక్ లకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ..వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల సీఎంలను అభినందిం చారు.

వరదల్లో చిక్కుకు పోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయాన్ని అందించాలన్నారు. తుపాను కారణంగా మరణాలు సంభవించడం దురదృష్ట కరమన్నారు. గురజాడ స్ఫూర్తితో వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించినట్లు తెలిపారు. చైతన్యంతో ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్నవారికి తోచిన విధంగా అందరూ సహాయాన్ని అందించాలని చేతులు జోడించి వేడుకున్నారు.