అధికార దుర్వినియోగం.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష

అధికార దుర్వినియోగం.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష

బీజింగ్: అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని చైనా మాజీ మంత్రి ట్యాంగ్ రెంజియాన్​కు కోర్టు ఆదివారం మరణశిక్ష వేసింది. అయితే, శిక్షను రెండేండ్ల పాటు వాయిదావేస్తూ ఊరట కల్పించింది. 

2007 నుంచి 2024 మధ్య వ్యవసాయం, రూరల్  అఫైర్స్ మంత్రిగా ట్యాంగ్  పనిచేశారు. అలాగే, కమ్యూనిస్టు పార్టీ మెంబర్  గ్రూప్​కు సెక్రటరీగా కూడా వ్యవహరించారు. మంత్రిగా ఉన్న సమయంలో ట్యాంగ్  తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలువురికి అక్రమంగా కాంట్రాక్టులు ఇచ్చారు. 

తనకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు. బదులుగా దాదాపు రూ.338 కోట్ల లంచాలు స్వీకరించారు. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ట్యాంగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అధికారులు దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో జిలిన్ ప్రావిన్స్​లోని చుంగ్ చాన్  పీపుల్స్  కోర్టు.. ట్యాంగ్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.