
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం (ఆగస్టు 04) సుమారు రెండు గంటల పాటు సాగిన మీటింగ్ లో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్టు సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. మొత్తం 660 పేజీల రిపోర్టులోని ముఖ్యాంశాలను ప్రెస్ మీట్ మీడియాకు వివరించారు మంత్రి.
పీసీ ఘోష్ కమిషన్ ప్రకారం.. మేడిగడ్డ లోపాలన్నింటికీ కారణంగా మాజీ సీఎం కేసీఆరేనని అన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అప్పటి ప్రభుత్వం నీటి లభ్యత కోసం ఎక్స్ పర్ట్ కమిటీని వేసిందనీ.. కానీ ఉద్దేశపూర్వకంగానే అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రిపోర్టును తొక్కిపెట్టారని అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి చెప్పిన కమిషన్ రిపోర్టులోని ముఖ్యాంశాలు:
- ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు
- పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల రిపోర్టు ఇచ్చారు
- కాళేశ్వరం కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారు..
- అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం కూలింది
- మేడిగడ్డ కుంగిన తర్వాత ప్రాజెక్టును పరిశీలించాం
- 2016లో మేడిగడ్డ బ్యారేజ్ అగ్రిమెంట్ జరిగింది
- మేడిగడ్డ కుంగినప్పుడు సీఎం కేసీఆరే నీటిపారుదల శాఖ మంత్రి
- నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్లానింగ్, డిజైన్, కన్ స్ట్రక్షన్ లోపాలున్నాయని రిపోర్టు ఇచ్చింది
- మేడిగడ్డ కుంగడానికి కారణాలు చెప్పింది
- కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ ప్లానింగ్, నిర్మాణం, మెయింటెనెన్స్ అన్నీ జరిగాయి
- 7 డిసెంబర్ లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి కమ్యూనికేట్ చేశాం
- NDSA (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీ ఇంక్వైరీ చేసింది
- మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీలలో నీళ్లు నిలిపే ఛాన్స్ లేదని రిపోర్ట్ ఇచ్చింది
- 2025 జులై 31 జస్టిస్ ఘోష్ రిపోర్టు ఇచ్చారు
- 660 పేజీల రిపోర్టును సమ్మరైజ్ చేసేందుకు ముగ్గురు మెంబర్ల కమిటీ వేశాం.
- కేబినెట్ ముందు పెట్టి వివరించడం జరిగింది
- కాళేశ్వరం కోసం అధికవడ్డీకి రూ.84 వేల కోట్లు ఖర్చు చేశారు
- అధిక వడ్డీలకు NBFC ల దగ్గర అప్పు తెచ్చారు
- తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు.. అందుకే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం అనే వాదనలో వాస్తవం లేదన్న ఘోష్ కమిషన్
- 2015లో ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి.. తెలంగాణకు లేఖ రాసింది..
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి దగ్గరనీళ్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు
- 205 టీఎంసీల నీళ్లు ఉన్నాయని,75 శాతం నీటి లభ్యత ఉందని లేఖలో చెప్పారు
- తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తున్నామనేది ఒక సాకు మాత్రమే
- బీఆర్ఎస్ ప్రభుత్వం 5 మంది రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్ కమిటీ వేసింది..
- వారు వేసిన కమిటీనే.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని రిపోర్టు ఇచ్చింది..
- డబ్బులు వృధా అవుతాయని కూడా చెప్పింది..
- ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్టును తొక్కిపెట్టారు
- అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీష్ రావు.. ఉద్దేశపూర్వకంగానే రిపోర్టును నెగ్లెక్ట్ చేశారు..
- సీడబ్లూసీ.. తుమ్మిడిహెట్టిదగ్గర, మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయని చెప్పింది..
- కానీ తుమ్మిడెహెట్టి దగ్గర నీళ్లు లేవని ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు
- బ్యారేజీలు వాటర్ స్టోరేజీకి కాకుండా.. వాటర్ డైవర్షన్ కోసమే వినియోగిస్తాం
- ఎక్కువ నీళ్లు ఎక్కువ రోజులు స్టోర్ చేయడంతో బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి
- పబ్లిసిటీ కూడా ఒక కారణం అని తేల్చిన ఘోష్ కమిషన్
- ప్రతి చిన్న విషయంలో ఆ నాటి ముఖ్యమంత్రి రాజకీయ జోక్యం చేసుకోవడం కారణంగానే బ్యారేజ్ లు డ్యామేజ్ కు గురయ్యాయి
- రీ ఇంజినీరింగ్ అనేది ఆనాటి ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలే కారణం