బూత్​ స్థాయిలో పునాదులు వేద్దాం

బూత్​ స్థాయిలో పునాదులు వేద్దాం
  • బీజేపీ ఆఫీస్​ బేరర్ల మీటింగ్​లో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: బూత్ లెవల్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆఫీస్ బేరర్ల సమావేశంలో నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ సీఎం వసుంధర రాజే చెప్పారు. శనివారం పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మీటింగ్ లో రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయని చెప్పారు. గరీబ్ కల్యాణ్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లు  ప్రజలకు చేరే అంశంపై, రాజకీయ తీర్మానాలపై చర్చించామని తెలిపారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషన్ జరిగిందన్నారు. ప్రతి ఎలక్షన్ బూత్ లో కనీసం 200 మంది యాక్టివ్ కార్యకర్తలు ఉండాలని, వారందరి మధ్య సమన్వయం కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. బూత్ లకు ‘‘పన్నా ప్రముఖ్’’లను నియమించి, పార్టీకి బలమైన పునాది నిర్మించాలని ఖరారు చేశామన్నారు.