నీట్​ అక్రమాలపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తా : రాహుల్ గాంధీ

నీట్​ అక్రమాలపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తా : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ లో అక్రమాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని స్టూడెంట్లకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘నరేంద్ర మోదీ ఇంకా ప్రధానిగా ప్రమాణం చేయకముందే, నీట్ ఎగ్జామ్ లో జరిగిన అక్రమాల వల్ల 24 లక్షల మంది స్టూడెంట్లు, వాళ్ల కుటుంబాల భవిష్యత్తు నాశనమైంది.

ఎడ్యుకేషన్ మాఫియా, ప్రభుత్వ యంత్రాంగం కలిసి నడిపిస్తున్న ‘పేపర్ లీక్ ఇండస్ట్రీ’ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద పటిష్టమైన ప్రణాళిక ఉంది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. ఈరోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ మాట ఇస్తున్నాను.. పార్లమెంట్ లో నేను మీ గొంతు వినిపిస్తాను. నీట్ లో అక్రమాలపై ప్రశ్నిస్తాను” అని అందులో పేర్కొన్నారు. కాగా, నీట్ లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.