భారీ అవినీతికి సూత్రధారి సోమేష్ కుమార్.. అందుకే ఆయనకు సలహదారు పదవి

 భారీ అవినీతికి సూత్రధారి సోమేష్ కుమార్.. అందుకే ఆయనకు సలహదారు పదవి

రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతికి సూత్రధారి మాజీ  సీఎస్  సోమేష్ కుమార్ అని..అందుకే అతన్ని సీఎం కేసీఆర్ తన సలహాదారునిగా పెట్టుకున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో కోర్టులను అభివృద్ధి చేసుకొనే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తెలంగాణ లో ఏ వ్యవస్థ సరైన విధంగా లేదని..అన్ని రంగాలు సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. జగిత్యాల జిల్లా  మెట్ పల్లి  కోర్టు ఆవరణలో నిర్మిస్తున్న రెస్ట్ రూమ్ కు ఎంపీ అర్వింద్ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారు.  ఈ సందర్భంగా అర్వింద్ ను  న్యాయవాదులు సత్కరించారు. 


తెలంగాణలో  లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ఎంపీ అర్వింద్ అన్నారు. కొందరు పోలీస్ అధికారులు సీఎం కేసీఆర్కు బానిసలుగా మారారని  చురకలంటించారు. అందుకే హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  20 సీట్లు రావడం కష్టమే అని చెప్పారు. లిక్కర్ స్కాం లో కవిత జైలుకు వెళ్ళాలని తెలంగాణ ప్రజలు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు.