మరికల్, వెలుగు : గడపగడపకూ కాంగ్రెస్పథకాలు అందుతున్నాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.శివకుమార్రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురువారం మరికల్మండలంలోని వెంకటాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పల్లెల్లో పంచాయితీలు పెట్టుకోకుండా అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాలని సూచించారు. చిన్న చిన్న గ్రామాలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులొస్తాయని, అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నాయకులు సూర్యమోహన్రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.

