జనసేనలో చేరిన మాజీ డీహెచ్‌‌‌‌ శ్రీనివాసరావు

జనసేనలో చేరిన మాజీ డీహెచ్‌‌‌‌ శ్రీనివాసరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మాజీ హెల్త్​ డైరెక్టర్‌‌‌‌ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌‌‌‌కల్యాణ్‌‌‌‌ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గడల మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం  నియోజకవర్గానికి చెందిన గడల శ్రీనివాసరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ టికెట్‌‌‌‌ కోసం ప్రయత్నించారు.