కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

 కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆగస్టు 10 రాత్రి తుది శ్వాస విడిచారు. నట్వర్ సింగ్ 1931 రాజస్థానల్ భరత్ పూర్ జిల్లాలో జన్మించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సమయంలో 2004-05 సమయంలో  కేంద్రమంత్రిగా పనిచేశారు. భారత్,పాకిస్తాన్ రాయబారిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. పలు పుస్తకాలను రాశానరు. 1984లో నట్వర్సింగ్ కు  పద్మ భూషణ్ వచ్చింది. 

  నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. విదేశాంగ విధానానికి ఎంతో కృషి చేశారని అన్నారు.