
పారిస్: అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి అక్రమంగా నిధులు సేకరించిన కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు పారిస్‌లోని న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, 2007లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుంచి భారీగా ఆర్థిక సాయం పొందారని ఆరోపణలు వచ్చాయి.
దౌత్య సహాయం అందించేందుకు బదులుగా సర్కోజీ ఈ నిధులు స్వీకరించారని పలు కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని అభియోగాలను కొట్టివేసిన కోర్టు.. ఒకదాంట్లో మాత్రం దోషిగా నిర్ధారించి ఐదేండ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా..అక్రమంగా నిధులు సేకరించిన కేసులో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును సర్కోజీ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు.