
ఉప్పల్, వెలుగు: భారతదేశంలోని హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఉప్పల్ మినీ శిల్పారామంలో జరుగుతున్న ‘మన గుడి, మన బలం’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
దేశంలో 2 లక్షల 19 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిపారు. హిందూ ధర్మ రక్షణకు పాటుపడుతున్న యమునా పాటక్ ను అభినందించారు. విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గోపాల్ రాజి, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ డాక్టర్ యమునా పాటక్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు.