సంగారెడ్డి (హత్నూర), వెలుగు: హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం చండీ హోమం నిర్వహించగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి, మురళీ యాదవ్, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పూజారి సభాపతి శర్మ వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. డిసెంబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బీజేపీ మండలాధ్యక్షులు నాగ ప్రభు గౌడ్, మల్లేశ్ యాదవ్ పాల్గొన్నారు.
